logo

గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం

‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు.

Published : 27 Apr 2024 05:45 IST

సైదాపూర్‌, చిగురుమామిడి, గన్నేరువరం, న్యూస్‌టుడే: ‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు. శుక్రవారం కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలిసి సైదాపూర్‌, చిగురుమామిడిలలో మంత్రి రోడ్డుషోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో ఆ పార్టీలు అధికారంలో ఉండి చేసిందేమీ లేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, తన తర్వాత ఎంపీలుగా వినోద్‌కుమార్‌, బండి సంజయ్‌లు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని మంత్రి సవాల్‌ విసిరారు. కేంద్రంలో మరోసారి భాజపా వస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు, రైతులకు తీరని నష్టం జరుగుతుందని వివరించారు. ఆటో కుటుంబాలకు ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అదజేస్తామన్నారు. గన్నేరువరంలో ఎంపీ అభ్యర్థి రాజేందర్‌రావు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఓర్వలేకే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని.. ప్రజలకు అనుగుణంగా హామీలను ప్రభుత్వం నెరవేస్తుందని వెల్లడించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ స్థానిక రోడ్ల అభివృద్ధిని త్వరితగతిన చేపడతామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, జడ్పీటీసీ సభ్యుడు రవీందర్‌, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి నాయకులు గంప వెంకన్న, తిరుపతిరెడ్డి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని