logo

మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు

లోక్‌ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 05:13 IST

వేములవాడ, న్యూస్‌టుడే: లోక్‌ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌ కూడలి వద్ద శుక్రవారం పోలీసులు నాకాబందీ నిర్వహించి చేపట్టిన వాహనాల తనిఖీలను ఎస్పీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా సరిహద్దులు, పట్టణాలు, మండల కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎవరైనా రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా సరైన ధ్రువపత్రాలు వెంట పెట్టుకొని వెళ్లాలని సూచించారు. సీజ్‌ చేసిన నగదుకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపిస్తే గ్రీవెన్స్‌ కమిటీ రెండు రోజుల్లో నగదు రిలీజ్‌ చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ను ఆర్డీవో రాజేశ్వర్‌తో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్‌రూం వద్ద భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వాటిని పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సీఐ వీర ప్రసాద్‌, ఎస్సైలు అంజయ్య, గోపాల్‌రెడ్డి, దిలీప్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని