logo

ఆన్‌లైన్‌ సదుపాయం.. వినియోగానికి దూరం

ఎన్నికల్లో కీలకమైన నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Published : 27 Apr 2024 05:12 IST

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: ఎన్నికల్లో కీలకమైన నామినేషన్‌ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2018లో తొలిసారిగా ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో అంతగా ప్రచారం లేకపోవడంతో ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటరు చైతన్య కార్యక్రమాల్లో ఆన్‌లైన్‌ నామినేషన్‌ సౌకర్యంపై విస్తృత ప్రచారం చేశారు. దీంతో చాలా మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని తర్వాత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చి నామపత్రాలు వేశారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్‌ స్థానాలకు ఆన్‌లైన్‌ నామపత్రాల దాఖలుకు స్పందన కరవైంది. ఒక్క అభ్యర్థి కూడా ఈ విధానంలో దాఖలు చేయలేదు.

సమయం ఆదా

నామినేషన్‌ సందర్భంగా పూరించే అఫిడవిట్‌లో అభ్యర్థి ప్రతి కాలమ్‌నూ జాగ్రత్తగా పూరించాలి. కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలు తదితర అంశాలు పక్కాగా సమర్పించాలి. ఏ ఒక్క అంశాన్నీ ఖాళీగా వదిలేసినా నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే ఆస్కారం ఉంటుంది. చిన్నపాటి తప్పిదంతో అభ్యర్థి పోటీకి దూరమవుతున్నారు. ఈ క్రమంలో నామపత్రాల దాఖలులో ఇబ్బందులు అధిగమించేందుకు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంతో అభ్యర్థితో పాటు అధికారులకు వెసులుబాటుగా ఉంటుంది. మిగిలిన నామినేషన్‌ తంతు రిటర్నింగ్‌ కార్యాలయంలో త్వరితగతిన పూర్తవుతుంది. దీంతో సమయం ఆదా అవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌లో 53, పెద్దపల్లిలో 63, నిజామాబాద్‌లో 42 నామపత్రాలు దాఖలు చేశారు. వీరిలో ఒక్కరు కూడా ఆన్‌లైన్‌ సేవలు సద్వినియోగం చేసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు