logo

ఆడియో సంభాషణపై విచారణ

స్టేషన్‌ బెయిల్‌ కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన ఆడియో సంభాషణపై కరీంనగర్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌ గురువారం విచారణ చేపట్టారు. వాటర్‌ ప్లాంట్‌ యజమానిపై కేసు నమోదవగా.. సదరు బాధితుడితో

Published : 24 Jun 2022 04:25 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: స్టేషన్‌ బెయిల్‌ కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన ఆడియో సంభాషణపై కరీంనగర్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌ గురువారం విచారణ చేపట్టారు. వాటర్‌ ప్లాంట్‌ యజమానిపై కేసు నమోదవగా.. సదరు బాధితుడితో మంత్రి పీఏ నంటూ మాట్లాడిన ఫోన్‌ సంభాషణను పోలీసు ఉన్నతాధికారులు సవాలుగా తీసుకున్నారు. ముఖ్యంగా ఏసీపీ, సీఐల పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలోనూ విచారణను చేపడుతున్నట్లు తెలిసింది. అసలు ఆ వాయిస్‌ ఎవరిదని పక్కాగా తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నిర్ధారణ తీసుకోనున్నారు. ఇదే సమయంలో అసలు ఎవరి నుంచి ఈ ఆడియో రికార్డింగ్‌ వైరల్‌గా మారిందనే విషయమై విచారణాధికారి సమగ్రంగా దర్యాప్తు చేపట్టబోతున్నారు. కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ ఆదేశాలతో విచారణ చేపట్టి వీలైనంత తొందరగా నివేదికను పోలీసు ఉన్నతాధికారులకు అందించేలా అదనపు డీసీపీ వేగాన్ని పెంచుతున్నారు. మొదటి రోజు పరిశీలనలో భాగంగా ఎఫ్‌ఐఆర్‌ వివరాలతోపాటు పలువురి ఫోన్‌ నంబర్ల వివరాల్ని సేకరించినట్లు తెలిసింది. ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఎవరు ఫోన్‌లో మాట్లాడారనే కాల్‌డాటాను కూడా సేకరించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని