logo

రుక్మాపూర్‌ ఘటనపై విచారణ

రుక్మాపూర్‌లో ఏడు సంవత్సరాల క్రితం ఓ భూ వివాదంలో పోలీసు అధికారి జరిపిన కాల్పులపై వరంగల్‌ కమిషనరేట్‌కు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి స్థానికంగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Published : 13 Aug 2022 04:07 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: రుక్మాపూర్‌లో ఏడు సంవత్సరాల క్రితం ఓ భూ వివాదంలో పోలీసు అధికారి జరిపిన కాల్పులపై వరంగల్‌ కమిషనరేట్‌కు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి స్థానికంగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన పోలీసు అధికారి వరంగల్‌ జిల్లాలో చాలా ఏళ్లు పని చేశారు. 2015లో అతని దగ్గరి బంధువుల భూమికి సంబంధించిన విషయంలో అండగా నిలిచి తన సర్వీస్‌ తుపాకీతో గాల్లోకి కాల్పలు జరిపి బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పట్లో కేసు నమోదవగా.. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో అతను చేసిన రియల్‌ దందాలపై విచారణ చేపడుతున్న క్రమంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోనే అనేక సంవత్సరాలు విధులు నిర్వహించిన నేపథ్యంలో ఆ అధికారితో నిత్యం అందుబాటులో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది, బంధుమిత్రులు వ్యవహారాలపై విచారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సదరు అధికారి గ్రామంతో పాటు కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో స్థానిక రియల్‌ వ్యాపారులతో జరిపి భూ విక్రయాలపై వ్యక్తిగతంగా విచారిస్తున్నట్లు తెలిసింది. కాల్పుల ఘటన సమయంలో అప్పుడు విధుల్లో ఉన్న పోలీసు అధికారుల పాత్రను కూడా విచారణలో భాగంగా అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. కరీంనగర్‌ పోలీసులు సైతం అప్పటి ఘటనపై రహస్యంగా సమాచారం సేకరిస్తున్నారు. ఏ క్షణాన ఉన్నతాధికారులు ఏమడిగినా తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలనేలా వివరాల్ని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి అజ్ఞాతంలో ఉండగా ఇటీవల రూక్మాపూర్‌లో రెండు రోజులు విడిది చేసి వెెళ్లినట్లు తెలియడంతో విచారణ అధికారులు ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. మూడు రోజుల్లో విచారణ పూర్తి కానున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని