logo

ఈసెట్‌లో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు

మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన ఎలాల హరితరెడ్డి ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. టీఎస్‌ ఈసెట్‌ పరీక్ష ఫలితాల్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 200కు గాను 173 మార్కులు పొంది సత్తా చాటారు

Published : 13 Aug 2022 04:07 IST

హరితరెడ్డి

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన ఎలాల హరితరెడ్డి ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. టీఎస్‌ ఈసెట్‌ పరీక్ష ఫలితాల్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 200కు గాను 173 మార్కులు పొంది సత్తా చాటారు. పదో తరగతి మెట్‌పల్లిలోని ఓ ప్రయివేట్‌ పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించారు. అనంతరం వరంగల్‌ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేశారు. ప్రస్తుతం ఈసెట్‌లో రెండో ర్యాంకు సాధించారు. హరితరెడ్డి తల్లిదండ్రులు మధుసూదన్‌రెడ్డి, లక్ష్మి స్థానికంగా వ్యవసాయం చేస్తారు.

నవీన్‌

8వ ర్యాంకు

నాగులమల్యాల(కరీంనగర్‌ గ్రామీణం) : ఈ-సెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్‌టీయూ విడుదల చేసిన ఈ-సెట్‌ ఫలితాల్లో కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాలకు చెందిన విద్యార్థి జింకల నవీన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో రాష్ట్రంలోనే 8వ ర్యాంకు, ఇంటిగ్రేటెడ్‌ ర్యాంకు 92 సాధించాడు. కుమారుడు ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ఇందిరా, నవీన్‌లు సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని