logo

మిగిలింది ఐదు రోజులే

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు పంపిణీ చేస్తున్న బ్యాంకు రుణాల గడువు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

Published : 26 Mar 2023 05:05 IST

అతివల స్వయం ఉపాధికి బ్యాంకు రుణాల గడువు

సమావేశమైన సభ్యులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు పంపిణీ చేస్తున్న బ్యాంకు రుణాల గడువు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రుణ లక్ష్య సాధనలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రోజువారీ ప్రగతిపై చర్చిస్తూ లోపాలను అధిగమిస్తున్నారు. ఈసారి వార్షిక ఏడాదికి సంబంధించి రుణ లక్ష్యాలు మధ్యలో పెంచడంతో ప్రగతి ఇబ్బందిగా మారింది. పెరిగిన లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు పలు కారణాలతో లావాదేవీలు నిలిచి సంఘాలపై దృష్టి సారించారు. మనుగడలోని సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాటిని తిరిగి గాడిలోకి తెచ్చేప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల రుణాలు తీసుకోవాలని ఒత్తిడితెస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


అగ్రపథంలో ఉమ్మడి జిల్లా

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2022-23 వార్షిక ఏడాదిలో 42,325 సంఘాలకు రూ.2060.7 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 27,897 సంఘాలకు రూ.2009.94 కోట్లు పంపిణీ చేశారు. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా రుణ ప్రగతిలో ఉమ్మడి జిల్లా అగ్రపథంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో కరీంనగర్‌ జిల్లా రెండోస్థానం, రాజన్న సిరిసిల్ల మూడో స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో రుణ ప్రగతిలో చూస్తే పెద్దపల్లి జిల్లా చివరిలో నిలిచింది. వార్షిక ఏడాది మధ్యలో లక్ష్యాలు పెంచడంతోనే ప్రగతి చేరుకోవడంలేదని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని