logo

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించండి

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు చేపట్టాలని నగర మేయర్‌ వై.సునీల్‌రావు ఆదేశించారు.

Published : 26 Mar 2023 05:05 IST

సమస్యలు తెలుసుకుంటున్న మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ ఇస్లావత్‌

సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు చేపట్టాలని నగర మేయర్‌ వై.సునీల్‌రావు ఆదేశించారు. శనివారం 38వ డివిజన్‌ బీరప్పకాలనీలో రూ.5 లక్షలతో నిర్మించే రోడ్డు పనులకు, 3వ డివిజన్‌ బీజేఆర్‌ కాలనీలో రూ.8 లక్షలతో తాగునీటి పైపులైను పనులకు కమిషనర్‌ సేవా ఇస్లావత్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 46వ డివిజన్‌ అశోక్‌నగర్‌, అహ్మద్‌పురలో మురుగుకాలువలు, రహదారుల సమస్యలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్లు కచ్చు రవి, కంసాల శ్రీనివాస్‌, నాంపల్లి శ్రీనివాస్‌, వంగల శ్రీదేవి, పవన్‌కుమార్‌, ఈఈలు మహేందర్‌, కిష్టప్ప, డీఈఈ మసూద్‌అలీ పాల్గొన్నారు.

కార్పొరేషన్‌ : స్వచ్ఛత ఉత్సవ్‌లో నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని నగర మేయర్‌ వై.సునీల్‌రావు పిలుపునిచ్చారు. శనివారం నగర పాలక కార్యాలయంలో స్వచ్ఛతోత్సవ్‌, కంటి వెలుగు, బేటీ బచావో, బేటీ బడావోపై మెప్మా ఆర్పీలతో సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, డిప్యూటీ కమిషనర్‌ త్రియంబకేశ్వర్‌, సహాయ కమిషనర్‌ రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని