logo

అర్బన్‌ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలకు సిద్ధం

కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించిన తాము సిద్ధంగా ఉన్నామని బ్యాంకు పీఐసీ ఛైర్మన్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు.

Published : 27 Mar 2023 04:55 IST

అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

మాట్లాడుతున్న పీఐసీ ఛైర్మన్‌, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించిన తాము సిద్ధంగా ఉన్నామని బ్యాంకు పీఐసీ ఛైర్మన్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. ఆదివారం నగరంలోని మార్కెట్‌ రోడ్డులో బ్యాంకు సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సాధారణ సమావేశాన్ని కొనసాగించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేశామని, దీనిపై సహకార శాఖకు లేఖ రాశామన్నారు. సభ్యులంతా ఫోన్‌ నెంబర్లు బ్యాంకులో నవీకరణ చేసుకోవాలని సూచించారు. జగిత్యాల, కరీంనగర్‌ బ్రాంచీలు కలిపి 9,050 మందికి సమావేశం ఉన్నట్లుగా సమాచారం చేరవేసినట్లు వివరించారు. త్వరలోనే ఏటీఎం ఏర్పాటు చేస్తున్నామని, డెబిట్‌ కార్డులు కూడా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో సభ్యులు అర్ష  మల్లేశం, దిండిగాల మహేశ్‌, ఎడబోయిన శ్రీనివాస్‌రెడ్డి, బ్యాంకు సీఈవో నునుగొండ శ్రీనివాస్‌, జగిత్యాల బ్రాంచి మేనేజర్‌ ఎలుక సుధాకర్‌, సభ్యులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని