logo

మట్టి గుట్టలు మాయం!

మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి.

Published : 29 Mar 2024 04:58 IST

మల్యాల, న్యూస్‌టుడే: మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. మట్టి తరలించడానికి అనుమతి పొందినట్లు అధికారులు చెబుతున్నా, తీసుకున్న అనుమతికి మట్టి తరలింపు విస్తీర్ణానికి పొంతనలేకుండా ఉంది. మండలంలోని ముత్యంపేట, నూకపల్లి, రామన్నపేట, మద్దుట్ల, గొల్లపల్లె, రాంపూర్‌ గ్రామాల శివారులోని వరద కాలువ మట్టిని రాత్రింబవళ్లు అక్రమంగా రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు పేర్కొంటున్నారు. ముత్యంపేట శివారులోని వరద కాలువ కట్ట నుంచి కొంతకాలంగా గుత్తేదార్లు మట్టిని తరలించడంతో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలాంటి మట్టికట్ట మాయం కావడంతో ఆ ప్రాంతం చదునుగా మారింది. కొన్ని గ్రామాల శివారులో చదునుగా మారిన వరద కాలువ ప్రాంతాన్ని ఆక్రమించుకుని సాగు, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని