logo

పర్యాయ ఘట్టానికి క్షణగణన

రెండేళ్లుగా కృష్ణ భక్తులు ఎదురుచూస్తున్న ఆ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ సమయం కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా పర్యాయ ఉత్సవానికి ఉడుపి పట్టణం లక్షల సంఖ్యలో భక్తులతో కిక్కిరిసి కనిపించేది. ప్రస్తుతం కరోనా కారణంగా అనేక ఆంక్షలు విధించడంతో

Published : 17 Jan 2022 04:45 IST


కాబోయే పర్యాయ మఠాధిపతి విద్యాసాగర తీర్థ చేతి నరాల్ని పరిశీలిస్తున్న ప్రస్తుత మఠాధిపతి ఈశప్రియతీర్థ

ఉడుపి, న్యూస్‌టుడే: రెండేళ్లుగా కృష్ణ భక్తులు ఎదురుచూస్తున్న ఆ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ సమయం కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా పర్యాయ ఉత్సవానికి ఉడుపి పట్టణం లక్షల సంఖ్యలో భక్తులతో కిక్కిరిసి కనిపించేది. ప్రస్తుతం కరోనా కారణంగా అనేక ఆంక్షలు విధించడంతో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. వచ్చిన కొద్దిమంది భక్తులు పర్యాయ ముహూర్తం కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ఇప్పటి వరకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సోమవారం అర్ధరాత్రి అనంతరం ఉడుపి పట్టణంలో పర్యాయ ఘట్టం ఆరంభమవుతుంది. కాబోయే పర్యాయ మఠాధిపతి అయిన కృష్ణాపుర మఠాధిపతి విద్యా సాగరతీర్థ ఉడుపి సమీపంలోని కాపు వద్ద దండి తీర్థంలో పుణ్యస్నానాలు చేసి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పట్టణ శివార్లలోని జోడుకట్టె చేరుకుంటారు. ఆ తరువాత సంప్రదాయం ప్రకారం ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ఆయనకు ప్రస్తుత పర్యాయ మఠాధిపతి ఈశప్రియతీర్థ అన్నం గరిటె, అక్షయ పాత్ర అందజేస్తారు. దీంతో పర్యాయ ఉత్సవంలో ప్రధాన ఘట్టం పూర్తవుతుంది. అక్షయపాత్ర, అన్నం గరిటె మధ్యాచార్యుడి కాలం నుంచి వస్తోంది. ఆయన తొలిసారిగా వీటిని తమ శిష్యుడికి అప్పగించారు. అప్పటి నుంచి ప్రతీ పర్యాయ సందర్భంలోనూ వీటిని కాబోయే పర్యాయ మఠాధిపతికి అందజేయడం సంప్రదాయంగా వస్తోంది. మధ్వాచార్యుడు ఆసీనులైన సర్వజ్ఞ పీఠంపై పర్యాయ మఠాధిపతి కూర్చుంటారు.

సర్వజ్ఞ పీఠం: మధ్వాచార్యుడు మఠం నిర్వహణ బాధ్యతలు చూసే స్థలమిది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని