logo

హులిగి జాతరకు భక్తకోటి!

కొప్పళ జిల్లాలోని సుప్రసిద్ధ హులిగి గ్రామంలోని హులిగమ్మ జాతర, రథోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయం పరిసరాలు ‘ఉధో ఉధో..’ నినాదాలతో మారుమోగాయి.

Published : 25 May 2022 05:07 IST

గంగావతి,న్యూస్‌టుడే : కొప్పళ జిల్లాలోని సుప్రసిద్ధ హులిగి గ్రామంలోని హులిగమ్మ జాతర, రథోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయం పరిసరాలు ‘ఉధో ఉధో..’ నినాదాలతో మారుమోగాయి. దారిపొడవునా తేరుకు అరటిపండ్లు, ఎండు ఖర్జూరాలు సమర్పించుకున్నారు. ఉత్సవం ఆలయం నుంచి పాదగట్టె దాకా సాగింది. వేలాది భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని