logo

నటనలో మిన్న.. మీ మనసే వెన్న!

నెలమంగల తాలూకా సోలదేవనహళ్లిలోని స్థానికుల కోసం సీనియరు నటి లీలావతి ప్రాథమిక ఆసుపత్రిని నిర్మించారు. ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ల చికిత్స కోసం వైద్యులు, సిబ్బందిని నియమించారు.

Published : 29 Sep 2022 02:20 IST

అలనాటి నటి లీలావతిని సత్కరిస్తున్న బొమ్మై

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : నెలమంగల తాలూకా సోలదేవనహళ్లిలోని స్థానికుల కోసం సీనియరు నటి లీలావతి ప్రాథమిక ఆసుపత్రిని నిర్మించారు. ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ల చికిత్స కోసం వైద్యులు, సిబ్బందిని నియమించారు. దాత లీలావతిని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బుధవారం మధ్యాహ్నం ఘనంగా సత్కరించి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. మీరెంత అందంగా ఉంటారో.. మీ హృదయం అంతే అందమని ప్రస్తుతించారు. గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ ఆసుపత్రి సదుపాయాన్ని ప్రారంభించిన మీ పేరును అందరూ చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని ప్రశంసించారు. కథానాయికగా, సహాయ నటిగా పలు సంవత్సరాలు కన్నడ చిత్ర పరిశ్రమలో మీదైన శైలిలో నటించి, కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. ప్రభుత్వం తరఫునే ఇక్కడ వైద్యులు సేవలు అందించేందుకు, అదనపు సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. స్థానికంగా పశువైద్యశాలను కూడా త్వరలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఈ ఏడాది రూ.7 కోట్ల ఖర్చుతో 100 సముదాయ ఆరోగ్య కేంద్రాలను నిర్మించిందని, మరో 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో లీలావతి కుమారుడు వినోద్‌ రాజ్‌, ఎమ్మెల్యేలు శ్రీనివాసమూర్తి, నాగరాజ్‌, సరిహద్దు అభివృద్ధి ప్రాధికార అధ్యక్షుడు డాక్టర్‌ సి.సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts