logo

అదిగదిగో వైమానిక వేడుక!

ఆసియా ఖండంలో అతి పెద్ద ఎయిర్‌ షో ‘ఏరో ఇండియా- 2023’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు నిర్వహిస్తామని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది.

Published : 29 Nov 2022 01:08 IST

ఆకాశంలో యుద్ధవిమానాల జోరు..

మల్లేశ్వరం, యశ్వంతపుర, న్యూస్‌టుడే : ఆసియా ఖండంలో అతి పెద్ద ఎయిర్‌ షో ‘ఏరో ఇండియా- 2023’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు నిర్వహిస్తామని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. యలహంక ఎయిర్‌ బేస్‌లో 14వ ఎడిషన్‌ ఎయిర్‌షోకు ఇప్పటి నుంచే సన్నాహకాలు చేసుకోనున్నారు. ఈ ఐదు రోజుల ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన విమాన తయారీ సంస్థలు, రక్షణ శాఖ పరికరాలను విక్రయించే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.

* ఈ ప్రదర్శన ఉత్తరప్రదేశ్‌, గోవా రాష్ట్రాల్లో నిర్వహించే అవకాశం ఉందని తొలుత సమాచారం అందింది. సౌకర్యాలు, ఇతర వెసులుబాట్లను అంచనాలోకి తీసుకున్న తరువాత బెంగళూరు ఉత్తమ వేదికగా రక్షణ శాఖాధికారులు తుది నిర్ణయానికి వచ్చారు. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కొరియా, జపాన్‌, మలేషియా, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్‌, రష్యా తదితర దేశాలకు చెందిన యుద్ధవిమానాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. రెండేళ్లకు ఓసారి ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు హైబ్రిడ్‌ తరహాలో విన్యాసాలు కొనసాగించడం ప్రస్తావనార్హం. ఆ సమస్య కరిగిపోవడంతో ఈసారి భారీ ఏర్పాట్లకు అధికారులు యలహంక వైమానిక దళం విమానాశ్రయాన్ని సిద్ధం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని