Crime News: కోడలిపై కన్నేసి.. కడతేరి పోయాడు
‘నీ భర్తతో నీకు సంతానం కలగదు. నా కోరిక తీర్చు. సంతానవతిని చేస్తా..’ అంటూ మామ తమ్మేగౌడ (55) పెట్టే వేధింపులను ఆ గృహిణి (30) తట్టుకోలేకపోయింది.
హాసన, న్యూస్‌టుడే : ‘నీ భర్తతో నీకు సంతానం కలగదు. నా కోరిక తీర్చు. సంతానవతిని చేస్తా..’ అంటూ మామ తమ్మేగౌడ (55) పెట్టే వేధింపులను ఆ గృహిణి (30) తట్టుకోలేకపోయింది. పెళ్లయి ఐదేళ్లయినా నువ్వు సంతానవతివి కాలేదంటూ, కుదిరినప్పుడల్లా ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడట. ఆయన వేధింపులను తట్టుకోలేక ఆ గృహిణి సిగ్గువిడిచి తన తల్లిదండ్రుల వద్ద కష్టం చెప్పుకొంది. తమ్మేగౌడకు మంచిగా చెబితే వినడని గుర్తించిన ఆ గృహిణి తల్లిదండ్రులు అతన్ని హత్య చేయించేందుకు పథకాన్ని రూపొందించారు. హాసన జిల్లా హొళెనరసీపుర ఠాణా పరిధిలోని తమ ఇంటికి వియ్యంకుడిని నవంబరు 13న పిలిపించి మద్యం, మాంసంతో విందు ఇచ్చారు. అతను మత్తులోకి జారుకున్న తర్వాత తాము ముందుగా రూ.50 వేలు కిరాయి ఇచ్చిన యువకులను ఇంటికి పిలిపించుకున్నారు. ఇనుప రాడ్‌తో అతనిపై దాడి చేసి కడతేర్చారు. మృతదేహాన్ని ఊరవతల పడేశారు. మృతుని మూడో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ గృహిణి తల్లిదండ్రులు మైలారగౌడ, తాయమ్మను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సుపారీ హంతకుల కోసం హొళెనరసీపుర ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్‌సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్‌సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్‌సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ