Crime News: ప్రేమన్నాడు.. నిరాకరించడంతో నరికేశాడు!
ప్రేమను నిరాకరించిందనే కోపంతో రాశి (19) అనే విద్యార్థినిపై ఆ యువకుడు దారుణంగా దాడికి దిగాడు.
బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : ప్రేమను నిరాకరించిందనే కోపంతో రాశి (19) అనే విద్యార్థినిపై ఆ యువకుడు దారుణంగా దాడికి దిగాడు. సొంత పనిమీద వీధిలోకి వచ్చిన ఆమె వెనుతిరిగి నడుచుకుంటూ వెళుతున్న వేళ మధుచంద్ర (25) అనే టెంపో ట్రావెల్ వాహన చోదకుడు ‘ప్రేమిస్తావా.. లేదా?’ అంటూ నిలదీశాడు. ఆమె కాదుపొమ్మనడంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దాడికి దిగాడని పోలీసు అధికారులు వివరించారు. ఆమె గొంతుపై కత్తి ఎక్కుపెట్టి, ఒక్కపెట్టున కోసేసి పారిపోయాడని తెలిపారు.
మంగళవారం సాయంత్రం చీకటి కమ్ముకునే వేళ పెద్దగా జన సంచారమూ లేని సమయంలో బెంగళూరు యలహంక సమీపంలోని శానుభూగనహళ్లి వద్ద జరిగిన ఈ సంఘటన దిగ్భ్రాంతిగొలిపింది. హతురాలు యలహంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ బీఏ చదువుతున్నట్లు గుర్తించారు. ఆ యువకుడు చాన్నాళ్లుగా ఆమెను ప్రేమ పేరుతో సతాయిస్తున్నట్లు తెలిపారు. కత్తి వేటుకు రహదారిపై విలవిలలాడుతున్న ఆమెను కొందరు ఆస్పత్రికి తరలించినా ప్రయోజనంలేక మంగళవారం రాత్రి కన్నుమూసింది. ఇటీవలే రాజానుకుంటలోని ఓ ప్రముఖ కళాశాల ప్రాంగణంలో ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురికావడం మరచిపోక ముందే.. ఈ ఘటన చోటుచేసుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Budget 2023: సరిహద్దులకు మరింత ‘రక్షణ’.. అగ్నివీరులకు ‘పన్ను’ ఊరట
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Sports News
IND vs NZ: అతి పెద్ద స్టేడియంలో.. అత్యంత కీలక పోరుకు వేళాయె..!
-
Politics News
Pawan: భూమి, ఇసుక, మద్యం నుంచి గనుల వరకు వచ్చే ప్రతి పైసా జగన్ చేతిలోనే: పవన్
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సమంత క్షమాపణ
-
India News
Budget 2023: ఆ స్కూళ్లలో 38,800 ఉద్యోగాలు: కేంద్రం