logo

గ్యారంటీలను చూడండి.. కాంగ్రెస్‌కు ఓటేయండి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్న గ్యారంటీలను చూసి మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర మంత్రి శివరాజ్‌ తంగడిగి కోరారు.

Published : 16 Apr 2024 00:56 IST

సిరుగుప్ప, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్న గ్యారంటీలను చూసి మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర మంత్రి శివరాజ్‌ తంగడిగి కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం హచ్చొళ్లి, రావిహళ్‌, రారావి గ్రామాల పరిధిలో  కాలనీల్లో పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ  ప్రజలకు ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య, యువనిధి, ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు నమ్మకం, గ్యారంటీగా ఉందన్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేందుకు కొప్పళ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బసవరాజ్‌ హిట్నాళ్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాయకులపై ఈడీ, సీబీఐలతో కేసులు నమోదు చేయిస్తూ జైళ్లకు తరలిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఈడీ, సీబీఐ కేసులు ఉన్న వారిని పక్కన చేర్చుకుని ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ప్రజలు గుర్తించాలన్నారు. అభ్యర్థి బసవారజ్‌ హిట్నాళ్‌, శాసనసభ్యులు బి.ఎం.నాగరాజు, బాదర్లి హంపనగౌడ ప్రసంగించారు. పికార్డ్‌ బ్యాంకు అధ్యక్షుడు చొక్కా బసవనగౌడ, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కరిబసప్ప, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.  


ఇంటింటి ప్రచారం చేపడదాం

శ్రీరామనగర్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి రాజశేఖర హిట్నాళ గెలుపునకు ఇంటింటి ప్రచారం చేపడదామని ఆ పార్టీ నాయకుడు, గ్యారంటీ పథకాల అనుష్టాన సమితి జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. శ్రీరామనగర్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, గ్యారంటీ పథకాలు తదితరాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుదామన్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు శాంతప్ప, సభ్యులు రెడ్డి వీర్రాజు, ముళ్లపూడి శ్రీనివాస్‌, మహబూబ్‌, సాంబమూర్తి, పిల్లి కృష్ణ, పి.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని