logo

మోదీ సభకు సకల సన్నాహాలు

బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు.

Published : 18 Apr 2024 02:47 IST

సభా ప్రాంగణ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న శోభా కరంద్లాజె

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు. సమావేశానికి వేదికె ఏర్పాటుకు ఆమె బుధవారం భూమి పూజ చేసి మాట్లాడారు. గాయత్రి వివార్‌ ఒకటో నంబరు గేటు నుంచి కార్యకర్తలు మైదానంలోకి రావలసి ఉంటుందన్నారు. బెంగళూరు దక్షిణ, ఉత్తరం, గ్రామీణ, కేంద్ర నియోజవకర్గాల నుంచి రెండు లక్షల మంది కార్యకర్తలు, ఓటర్లు సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ప్రతి బూత్‌ సమితి కార్యకర్త 20 మంది ఓటర్లతో సమావేశానికి హాజరు కావాలని సూచించామని చెప్పారు. బెంగళూరుపై ప్రధానికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. పార్టీ నాయకులు వీ సునీల్‌ కుమార్‌, నందీశ్‌ రెడ్డి, హరీశ్‌, సీకే రామమూర్తి, సప్తగిరి గౌడ తదితరులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భాజపాలో ‘అఖండ’ ప్రస్థానం

బెంగళూరు (మల్లేశ్వరం): మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప డాలర్స్‌ కాలనీ నివాసంలో మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్‌ బుధవారం కాషాయ పతాకాన్ని అందుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యడియూరప్పతో పాటు బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి శోభా కరంద్లాజెలతో కలిసి అఖండను పార్టీ కార్యకర్తలు సత్కరించారు. బెంగళూరు ఉత్తర లోక్‌సభ భాజపా అభ్యర్థి శోభా కరంద్లాజె విజయానికి శ్రమిస్తానని ఆయన తెలిపారు. శోభ కనీసం మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. తన నివాసంపై కొన్ని ముస్లిం సంఘాలు దాడి చేసినప్పుడు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మేయరు దాడికి నేతృత్వం వహించాడని తెలిసినప్పుడు తనకు భాజపా మద్దతుగా నిలిచిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టికెట్‌ కేటాయించకుండా కాంగ్రెస్‌ తనను నిర్లక్ష్యం చేసిందన్నారు. బేషరుతుగా తాను భాజపాలో చేరానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు