logo

హార జలం

అణుశక్తి రంగంలో దేశ స్వయం సమృద్ధికి అశ్వాపురం సమీపంలోని ‘మణుగూరు భారజల ప్లాంటు’ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతను భుజానికెత్తుకుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘ఆక్సిజన్‌-18’ ఉత్పత్తికీ వేదికగా మారింది.

Published : 19 Jan 2022 05:37 IST

అశ్వాపురం, న్యూస్‌టుడే: అణుశక్తి రంగంలో దేశ స్వయం సమృద్ధికి అశ్వాపురం సమీపంలోని ‘మణుగూరు భారజల ప్లాంటు’ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇప్పుడు మరోసారి ఆ బాధ్యతను భుజానికెత్తుకుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘ఆక్సిజన్‌-18’ ఉత్పత్తికీ వేదికగా మారింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు భారజల ప్లాంట్లు ఉండగా వాటిల్లో ఆది నుంచీ మన కర్మాగారానికి ప్రాధాన్యం ఉంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంపై ఆధారపడిన భారజల కేంద్రం. వందశాతం విజయవంతమైన కేంద్రం కూడా ఇదొక్కటే. ఇక్కడ ఉత్పత్తి అయ్యే భారజలానికి 99.9 శాతం నాణ్యత ఉంటుంది. ప్రపంచంలో ఏ భారజలానికీ ఇంత నాణ్యత లేదు. అందుకే ప్రపంచ విపణిలో గిరాకీ ఎక్కువ. ఈ నేపథ్యంలో అనేక విజ్ఞాన అవసరాలను తీర్చే, భవిష్యత్తులో వివిధ రంగాల్లో కీలక మార్పులకు దోహదం చేసే ఆక్సిజన్‌-18 ఉత్పత్తిని సోమవారం నుంచి ప్రారంభించింది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఆక్సిజన్‌-18 కూడా 95.5 శాతం నాణ్యతతో కూడి ఉండటం విశేషం.

‘‘ఇది ఎంతో గర్వకారణం. ఇంత ప్రతిష్ఠాత్మకమైన ముందడుగు నా హయాంలోనే పడటం, అందుకు నేను సాక్ష్యంగా ఉండటం సంతోషంగా ఉంది. సమష్టి కృషి తోనే ఈ విజయం సాధ్యమైంది. భారజల ప్లాంటు సమున్నత కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరింత అంకితభావంతో కృషి చేస్తాం.’’

- జి.సతీశ్‌, జనరల్‌ మేనేజర్‌, మణుగూరు భారజల ప్ల్లాంటు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని