logo

జీవో నం.317సవరించాలని ఆందోళన

ప్రభుత్వం తీసుకొచ్చిన 317 ఉత్తర్వులు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్‌పీసీ-జాక్టో ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి.

Published : 19 Jan 2022 05:48 IST

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వం తీసుకొచ్చిన 317 ఉత్తర్వులు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాలిట శాపంగా మారాయని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్‌పీసీ-జాక్టో ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. 317 జీవోను సవరించి భార్యా భర్తలను ఒకే జిల్లాలో ఉంచాలని, పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పీళ్లన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం  కలెక్టర్‌ గౌతమ్‌కు, జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజుకు వినతి పత్రాలు అందజేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  దుర్గాభవాని, జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు, టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి విజయ్‌, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మాధవరావు, టీటీఎఫ్‌ జిల్లా బాధ్యులు రామారావు, బన్సీలాల్‌, వివిధ సంఘాల బాధ్యులు నాయకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని