logo

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం: కలెక్టర్‌

ప్రజా సమస్యలను పరిష్కరించి నివేదికలను అందజేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమానికి  ఫోన్‌లో వివిధ ప్రాంతాల ప్రజలు చేసిన ఫిర్యాదులను ఆయన నమోదు చేసుకున్నారు.

Published : 25 Jan 2022 03:47 IST

విజ్ఞప్తులు వింటున్న అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను పరిష్కరించి నివేదికలను అందజేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమానికి  ఫోన్‌లో వివిధ ప్రాంతాల ప్రజలు చేసిన ఫిర్యాదులను ఆయన నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను శాఖలకు పంపగానే వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు, జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ముత్యం, ఆర్డీవో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు కొన్ని
* ‘సర్వే నం7/7లో నాకు 8 సెంట్లు భూమి ఉంది. దీన్ని సీతారామ ప్రాజెక్టు కింద సేకరించారు. కానీ 4 సెంట్లు ఉన్నట్లే జాబితాలో చూపారు. దానికీ పరిహారం ఇవ్వలేదు’.

-  భూషమ్మ, దుమ్ముగూడెం మండలం.

* ‘సర్వే నం.512లోని మా భూమికి ఇతరులకు పట్టా జారీ చేశారు. పునః పరిశీలించి పాస్‌పుస్తకం అందించాలి.

- వెంకప్ప, అశ్వారావుపేట మండలం

* ‘సర్వే నం.9/1/2లోని మా భూమిని చెరువు శిఖంగా చూపారు. పునర్విచారణ చేపట్టి న్యాయం చేయాలి’.

- వెంకటేశ్వరరావు, దమ్మపేట మండలం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు