logo

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట యువతి దీక్ష

భర్త ఆచూకీ తెలపాలంటూ ఓ యువతి గ్రామ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. కారేపల్లికి చెందిన వేణు, ఎర్రబోడు గ్రామానికి చెందిన సునితలు గ్రామస్థుల సమక్షంలో 2021, అక్టోబరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

Published : 27 Jan 2023 02:47 IST

దీక్ష చేస్తున్న యువతి సునిత

కారేపల్లి, న్యూస్‌టుడే: భర్త ఆచూకీ తెలపాలంటూ ఓ యువతి గ్రామ కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనకు దిగింది. వివరాలిలా ఉన్నాయి. కారేపల్లికి చెందిన వేణు, ఎర్రబోడు గ్రామానికి చెందిన సునితలు గ్రామస్థుల సమక్షంలో 2021, అక్టోబరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టి అక్కడే కొద్ది నెలలు వేణు చిరుద్యోగం చేశాడు. ఆదాయం చాలటం లేదని 2022లో ఖమ్మం వచ్చి సునితని ఓ హాస్టల్‌లో ఉంచాడు. ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుని తీసుకెళ్తానని చెప్పి వెళ్లిన వేణు కొద్ది రోజుల తరువాత అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో సునిత ఎనిమిది నెలల క్రితం కారేపల్లి వచ్చి కొద్ది రోజులపాటు అత్తింటి ఎదుట దీక్ష చేపట్టింది. ఈ క్రమంలో అత్త ఇల్లు వదిలి వెళ్లటంతో అప్పటి నుంచి అందులోనే ఒంటరిగా ఉంటోంది. భర్తపై ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తిరిగి వచ్చిన అత్త నాగమణి, కోడలు సునితల మధ్య తగాదా చోటుచేసుకుంది. సునితను ఇంటి నుంచి బయటకు పంపివేశారు. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక ప్రధాన కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నల్లరిబ్బెన్‌ నోటికి కట్టుకుని మౌన దీక్ష చేపట్టింది. రూ.లక్షల్లో కట్నం తేవాలని వేధిస్తున్నారని, తన భర్త ఎక్కడ ఉన్నాడో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. ప్రాణభయంతో బతుకుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

రాత్రి 9 గంటల సమయంలో..: రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్సై రామారావు యువతి వద్దకు వచ్చి శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీపీఎం, ఎన్డీ నాయకులు యువతికి మద్దతుగా నిలిచారు. ఎస్సై హామీ అనంతరం భర్త ఇంట్లోకి వెళ్లేందుకు సునిత యత్నించగా కుటుంబ సభ్యులు మళ్లీ అడ్డుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని