logo

భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి

వీఐపీలు, వీవీఐపీల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఎస్పీ, జిల్లా పోలీస్‌ శిక్షణాకేంద్ర ప్రిన్సిపల్‌ ఎన్‌వీ రామాంజనేయులు సూచించారు. పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్ల(పీఎస్‌వో)కు జిల్లా శిక్షణ

Published : 24 May 2022 03:28 IST

పీఎస్‌వోలకు సూచనలిస్తున్న ఏఎస్పీ రామాంజనేయులు

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: వీఐపీలు, వీవీఐపీల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఎస్పీ, జిల్లా పోలీస్‌ శిక్షణాకేంద్ర ప్రిన్సిపల్‌ ఎన్‌వీ రామాంజనేయులు సూచించారు. పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్ల(పీఎస్‌వో)కు జిల్లా శిక్షణ కేంద్రంలో మూడు రోజుల రిఫ్రెషర్స్‌ కోర్సును ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో భాగంగా వ్యాయామం, యోగా నిర్వహించాలన్నారు. ప్రముఖులతో కలిసి ప్రయాణాలు చేసే సమయంలో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఏఆర్‌ ఏఎస్పీ ఎస్‌వీడీ ప్రసాద్‌, అడ్మిన్‌ ఆర్‌ఐ శ్రీనివాస్‌, డీటీసీ ఆర్‌ఐ సారథిÅ, ఆర్‌ఎస్సై శివశంకర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్పందనలో ఫిర్యాదుల స్వీకరణ
రోజూ స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఏఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన ఓ వృద్ధుడు తనను మోసం చేసి కొడుకు, కోడలూ రూ.20 లక్షలు కాజేశారని, గన్నవరం మండలానికి చెందిన ఓ వివాహిత బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్న తన భర్త కాపురానికి తీసుకువెళ్లడం లేదని తగు న్యాయం చేయాలని కోరారు. సివిల్‌ తగాదాలకు సంబంధించి 16 మంది, కుటుంబ కలహాల విషయంలో 15 మంది, ఇతర వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ 21 మంది మొత్తం 52 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ, ఏఎస్పీలు విచారించి చట్ట పరిధిలో తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని