logo

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఎ.పద్మ సూచించారు. డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు

Published : 26 May 2022 06:18 IST


సమావేశంలో మాట్లాడుతున్న డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి పద్మ, వేదికపై డీఆర్వో, అధికారులు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఎ.పద్మ సూచించారు. డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలకు సంబంధించి జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పద్మ మాట్లాడుతూ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా సంబంధిత శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్సు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. 14 సంవత్సరాల లోపు వయస్సున్న బాల, బాలికలు దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల్లో పనిలో ఉంటే బాలకార్మికులుగా పరిగణించాలనీ, అలాంటి వారిని గుర్తించడంతో పాటు వారి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పాల్గొన్న విజయవాడ నగర ఏడీసీపీ(క్రైమ్‌) పి.వెంకటరత్నం మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. బచపన్‌ బచావో ఆందోళన్‌ రాష్ట్ర సమన్వయకర్త తిరుపతిరావు, ఛైల్డ్‌ వెల్ఫేర్‌ స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్‌ కె.సువార్త, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఫ్రాన్సిస్‌థామస్‌, సహాయ కార్మిక అధికారి ఎం.శ్రీమన్నారాయణలతో పాటు బాలల సంక్షేమ, పోలీస్‌, సాంఘిక సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని