logo

ఛార్జీల పెంపుపై ఎగిసిన నిరసనలు

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల కాలంలో పలుమార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై ఎనలేని

Published : 02 Jul 2022 01:56 IST

నిరసన తెలుపుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెదేపా నాయకులు, కార్యకర్తలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల కాలంలో పలుమార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై ఎనలేని భారం వేశారని ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను నిరసిస్తూ నగరంలోని తెదేపా కార్యాలయ ఆవరణలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, కోడుమూరు నియోజకవర్గ బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్రకుమార్‌, పి.రవికుమార్‌, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్‌, నాయకులు మహేష్‌ గౌడ్‌, తిరుపాల్‌బాబు, నంది మధు, అబ్బాస్‌, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు ఆర్టీసీ (బి.క్యాంపు), న్యూస్‌టుడే: డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం దారుణమని, వెంటనే తగ్గించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెంచిన ఛార్జీలకు నిరసనగా నగరంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ధర్నా కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి నగేష్‌ అధ్యక్షత వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని