logo

ఆలూరు నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరవేస్తాం

ఆలూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ను గెలిపించి తెదేపా జెండా ఎగరవేస్తామని ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షులు సాలి సాహెబ్, మండల తెదేపా నాయకులు సతీష్ కుమార్ అన్నారు.

Updated : 29 Mar 2024 17:28 IST

ఆస్పరి: ఆలూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ను గెలిపించి తెదేపా జెండా ఎగరవేస్తామని ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షులు సాలి సాహెబ్, మండల తెదేపా నాయకులు సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం తెదేపా అదిష్ఠానం ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ వీరభద్రగౌడ్‌కు కేటాయించడంతో ఆస్పరిలో అంబేద్కర్ కూడలి బస్టాండ్ వద్ద బాణాసంచా కాల్చి నంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరభద్ర గౌడ్ గెలుపు కోసం తెదేపా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఆలూరు నియోజకవర్గం లో తెదేపా జెండా ఎగరవేయడమే తమ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో మారేష్, వీరేష్, అశోక్ కుమార్, హరి, బాలకృష్ణ, భాస్కర్, రవి, లోకేష్, మహేష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని