logo

ఓటు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం

ప్రతిఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.

Published : 20 Apr 2024 05:09 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ప్రతిఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. స్వీప్‌ యాక్టివిటీలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో ఓటుహక్కు వినియోగంపై అవగాహన పెంచేందుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఫ్లెక్సీపై సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్దఎత్తున ఓటర్లు పాల్గొనాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని