logo

పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం

పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం.

Published : 24 Apr 2024 05:14 IST

న్యూస్‌టుడే, పాణ్యం

పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. నియోజకవర్గంలో ప్రస్తుతం తెదేపా, వైకాపా మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. నియోజకవర్గంలో కల్లూరుకు చెందిన ఓటర్లే గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. ఆరుసార్లు పాణ్యం ఎమ్మెల్యేగా కొనసాగిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మూడోసారి పోటీ చేస్తున్న గౌరు చరితారెడ్డి రానున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


పారిశ్రామిక ప్రాంతం

పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండలాలతో పాటు కల్లూరు పరిధిలో కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన 16 వార్డులు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఓర్వకల్లు, కల్లూరు పారిశ్రామికవాడలు, ఎయిô్పోర్టు, డీఆô్డీవో, న్యాయ, ఉర్దూ విశ్వవిద్యాలయాలు, జిందాల్‌ సిమెంట్‌ పరిశ్రమ, జైరాజ్‌ ఇస్పాê్ ఉక్కుపరిశ్రమ, గని, పిన్నాపురం సౌర పరిశ్రమలతో పాటు, ప్రపంచంలోనే మొదటిసారి నిర్మిస్తున్న పిన్నాపురం రెన్యుబుల్‌ ఎనర్జీ విద్యుత్తు కేంద్రంతో పాటుగా ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్న నియోజకవర్గంగా ప్రాధాన్యం పొందింది. గోరుకల్లు జలాశయం, ఎస్సార్బీసీ కేసీ కాల్వల కింద సాగునీరు అందుతోంది.


ముఖ్యమంత్రి పోటీచేశారు

నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కô్రెడ్డి సీఎం హోదాలోనే 1993లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనపై తెదేపా నుంచి రేణుకాచౌదరి పోటీ పడ్డారు. దివంగత మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయ్యపురెడ్డి పాణ్యం బరినుంచి పోటీ చేశారు.


కల్లూరు ఓటరు కరుణ ఎవరిమీదో

గతంలో పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం మండలంతో పాటు బనగానపల్లె, వెల్దుర్తి, బేతంచెర్ల మండలాలు ఉండేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండలాలతో పాటు కర్నూలు కార్పొరేషన్‌లోని 16 వార్డులు కలిపి నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ 16 వార్డుల్లో లక్షకుపైగా ఓటర్లు ఉన్నారు.


ఈసారి ఎవరో

2024లో పాణ్యం నియోజకవర్గంలో 14వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తెదేపా నుంచి గౌరు చరితారెడ్డి, వైకాపా నుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి పోటీ పడుతున్నారు. గౌరు చరితారెడ్డి మూడోసారి పోటీ చేస్తుండగా, కాటసాని రాంభూపాల్‌రెడ్డి తొమ్మిదోసారి ఎన్నికల బరిలో ఉన్నారు.


ఎవరు ఎన్నిసార్లు గెలిచారు

పాణ్యం నియోజకవర్గంలో 1967 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఉప ఎన్నికతో కలిపి 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ ఏడుసార్లు, తెదేపా రెండుసార్లు,  వైకాపా రెండుసార్లు,  జనతాపార్టీ ఒకసారి, స్వతంత్రులు ఒకసారి ఎన్నికయ్యారు.

  • 1967 వీరెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)
  • 1972 ఏరాసు అయ్యపురెడ్డి (కాంగ్రెస్‌)
  • 1978 ఏరాసు అయ్యపురెడ్డి (జనతా పార్టీ)
  • 1983 చల్లా రామకృష్ణారెడ్డి (తెదేపా)
  • 1985 కాటసాని రాంభూపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • 1989 కాటసాని రాంభూపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • 1993 జరిగిన ఉప ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి (కాంగ్రెస్‌)
  • 1994 కాటసాని రాంభూపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • 1999 బిజ్జం పార్థసారథిరెడ్డి  (తెదేపా)  
  • 2004 కాటసాని రాంభూపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • 2009 కాటసాని రాంభూపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • 2014  ఎన్నికల్లో గౌరు చరితారెడ్డి (వైకాపా)
  • 2019 కాటసాని రాంభూపాల్‌రెడ్డి (వైకాపా)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు