logo

ఫోన్‌ చేయండి.. ధ్రువపత్రం పొందండి

బతికున్నట్లు ధ్రువీకరించే జీవన ప్రమాణ పత్రాన్ని పొందాలంటే గతంలో రోజుల తరబడి సమయం పట్టేది. ప్రస్తుతం తపాలా శాఖ తీసుకొచ్చిన సదుపాయంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే పొందొచ్చు.

Published : 29 Nov 2022 02:56 IST

వయోవృద్ధుల కోసం తపాలా శాఖ కృషి


మహబూబ్‌నగర్‌ ప్రధాన తపాలా కార్యాలయం

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం: బతికున్నట్లు ధ్రువీకరించే జీవన ప్రమాణ పత్రాన్ని పొందాలంటే గతంలో రోజుల తరబడి సమయం పట్టేది. ప్రస్తుతం తపాలా శాఖ తీసుకొచ్చిన సదుపాయంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే పొందొచ్చు. ఒక్క ఫోన్‌ చేస్తే చాలు.. తపాలా సిబ్బంది ఇంటికే వచ్చి వెంటనే జీవన ప్రమాణ పత్రాన్ని అందిస్తారు. విశ్రాంత ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పింఛనుదారుల సౌకర్యార్థం తపాలా శాఖ ఈ సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వం విధించిన గడువులోగా పింఛనుదారులు ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో జీవన ప్రమాణ పత్రాలను ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగ విరమణ పొంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు పత్రం పొందాలంటే ఇబ్బందులు పడేవారు. దీన్ని గుర్తించిన తపాలాశాఖ విశ్రాంత ఉద్యోగులకు సేవ చేసేందుకు ముందుకొచ్చింది.

* వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు జీవన ప్రమాణ పత్రాలు, వేలిముద్రలు సమర్పించడానికి కార్యాలయాల చుట్టు తిరుగకుండా తపాలా శాఖకు ఫోన్‌ చేయొచ్చు. ఆ శాఖ సిబ్బంది నేరుగా ఇంటికే వస్తారు. క్షణాల్లో జీవణ ప్రమాణ పత్రాన్ని (డిజిటలైజేషన్‌ లైవ్‌ సర్టిఫికేట్‌) అందిస్తారు. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాన్ని నమోదు చేశాక నేరుగా ఖజానా కార్యాలయానికి పంపిస్తారు. లేదంటే ప్రింట్‌ కాపీనీ తీసుకోవచ్చు. తపాలాశాఖకు సర్వీసు ఛార్జి కింద రూ.70 చెల్లించాల్సి ఉంటుంది.

* పింఛను పొందుతున్న వయోవృద్ధులకు సేవలందించేందుకు తపాలాశాఖ ముందుకొచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను తెరిచాం. నేరుగా వచ్చి తపాలా కార్యాలయాల్లో జీవన ప్రమాణ పత్రాలను పొందొచ్చు. కార్యాలయానికి రాలేని వారు మహబూబ్‌నగర్‌ హెడ్‌ పోస్ట్‌మాస్టర్‌కు 77804 25396, ఐపీపీబీ సీనియర్‌ మేనేజరుకు 86180 34580, గద్వాల హెడ్‌ పోస్ట్‌మాస్టర్‌కు 86398 07824 ఫోన్‌ నంబర్లలో సమాచారం అందిస్తే వారింటికి వెళ్లి ధ్రువపత్రాన్ని అందిస్తాం.

- షేక్‌ షబ్బీర్‌, తపాలా శాఖ మహబూబ్‌నగర్‌ డివిజన్‌ పర్యవేక్షకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని