logo

ఇక్కడ నిండి.. ఏపీకి తరలింపు

అలంపూర్‌ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు.

Published : 29 Mar 2024 03:33 IST

అలంపూర్‌, న్యూస్‌టుడే: అలంపూర్‌ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఎండు మిర్చికి మద్దతు ధర లేకపోవడంతో ఉండవల్లి, మానవపాడు మండల పరిధిలోని నాలుగు శీతల గిడ్డంగులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఇక్కడ ఖాళీ స్థలాలు లేకపోవడంతో రైతులు ఏపీకి తరలించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి సైతం చాలా మేరకు తగ్గిపోయింది. ఎకరాకు పది క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సి ఉండగా, వర్షాలు లేకపోవడం, వైరస్‌ రావడంతో దిగుబడి తగ్గింది. ఆ వచ్చిన పంటకు సైతం మద్దతుధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 60 వేల ఎకరాలకుపైగా మిరపను సాగు చేశారు. శీతల గిడ్డంగుల్లో క్వింటా ఏడాది నిల్వకు రూ.150 వరకు చెల్లించాల్సిన పరిస్థితి రైతులది. గతేడాది క్వింటా రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు పలుకగా నేడది రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఉండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని