logo

సెల్‌టవర్‌ బ్యాటరీ చోరులపై పీడీ చట్టం అమలు

సెల్‌టవర్ల బ్యాటరీలను అపహరిస్తున్న అంతర్‌ జిల్లా దొంగలపై కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ పోలీసులు నిర్బంధ (పీడీ చట్టం) ఉత్తర్వులు అమలు చేశారు. యాదాద్రి

Published : 21 Jan 2022 02:12 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: సెల్‌టవర్ల బ్యాటరీలను అపహరిస్తున్న అంతర్‌ జిల్లా దొంగలపై కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ పోలీసులు నిర్బంధ (పీడీ చట్టం) ఉత్తర్వులు అమలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం తాతానగర్‌కు చెందిన మాదాసు వినోద్‌ (25) మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం సిర్సనగండ్ల గ్రామానికి చెందిన గార్లపాటి భాస్కర్‌రెడ్డి(25) ప్రస్తుతం హైదరాబాద్‌ అంబర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు నిందితులు 2012 నుంచి 2014 వరకు భువనగిరి జిల్లాలో 9 కన్నపు నేరాలకు పాల్పడి అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాం మార్చి అంబర్‌పేటలో నివాసం ఉంటూ హయత్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌కె ట్రాన్స్‌పోర్టు సంస్థలో డ్రైవర్లుగా పనిచేశారు. సంస్థలోని వాహనంలో రవాణా చేస్తున్న సెల్‌ టవర్ల భాగాలను అమర్చే విధానాన్ని తెలుసుకుని సంస్థలో డ్రైవర్లుగా పని చేస్తున్న తుమ్మనపల్లి సాయిరాంరెడ్డి, జమ్మల జశ్వంత్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 2012 నుంచి కరీంనగర్‌, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాలో సెల్‌ టవర్లలో ఉన్న 13 బ్యాటరీలను అపహరించారు. 24 డిసెంబర్‌ 2021లో అపహరించిన బ్యాటరీలు కారులో వినోద్‌, భాస్కర్‌రెడ్డిలు హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లో జైలులో ఉన్నారు. జైలర్‌ రమేష్‌ సమక్షంలో  చర్లపల్లి జైలుకు తరలించినట్లు తిమ్మాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శశిధర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని