logo

‘మల్లన్న’ సన్నిధిలో అత్యాధునిక క్యూ కాంప్లెక్స్‌

కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ వర్గాలు ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అత్యాధునిక క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈమేరకు ఆలయం ముందు రాజగోపురం పక్కనున్న ప్రైవేటు వ్యక్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అందుకుగాను 11 మందికి ఆలయ నిధుల నుంచి రూ.78.46 లక్షలు పరిహారంగా అందజేశారు. భూమి కోల్పోయిన మేరకు ఆలయ ఆధీనంలోని స్థలం కేటాయించారు. రాజగోపురం

Published : 21 May 2022 01:26 IST

న్యూస్‌టుడే, చేర్యాల

రాజగోపురం పక్కన చదును చేసిన స్థలం

కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ వర్గాలు ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అత్యాధునిక క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈమేరకు ఆలయం ముందు రాజగోపురం పక్కనున్న ప్రైవేటు వ్యక్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అందుకుగాను 11 మందికి ఆలయ నిధుల నుంచి రూ.78.46 లక్షలు పరిహారంగా అందజేశారు. భూమి కోల్పోయిన మేరకు ఆలయ ఆధీనంలోని స్థలం కేటాయించారు. రాజగోపురం పక్కన మొదలుకొని రేణుకాఎల్లమ్మ స్వాగత తోరణం వరకు ఉన్న ప్రైవేటు వ్యక్తుల దుకాణాల తొలగింపు ప్రక్రియ పూర్తయింది.  సుమారు 2వేల గజాల స్థలం సిద్ధమైంది. ఈ ప్రదేశానికి ఆనుకొని మల్లన్న కొలువైన గుట్టలే ఉండటంతో వాటినీ చదును చేసి సుమారు ఎకరం స్థలంలో అత్యాధునిక క్యూ కాంప్లెక్స్‌ నిర్మించాలని ఆలయ వర్గాలు యోచిస్తున్నాయి.

తప్పని నిరీక్షణ..
ఏటా మల్లన్న దర్శనానికి 20 లక్షల మంది ఆలయానికి తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్యం 20వేల నుంచి 40వేల మంది దర్శించుకుంటారు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ క్యూలైన్‌లో భక్తులు చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో రోజైతే 4 గంటలు క్యూలైన్లలో గడపాల్సి వస్తోంది .ఈ ఇబ్బందులు తొలగించేందుకే క్యూ కాంప్లెక్స్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచనలతో ఆలయ అధికారులు, పాలక మండలి ఛైర్మన్‌ గీస భిక్షపతి, సభ్యులు పనులను పర్యవేక్షిస్తున్నారు. క్యూకాంప్లెక్స్‌కు సుమారు రూ.3 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇటీవలే నమూనా తయారు చేయించారు. అందులో ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. సేద తీరేందుకు తిరుమల తరహాలో గదులు నిర్మించి... తాగునీరు, అల్పాహార కేంద్రాలతో పాటు శౌచాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వరుసలను ప్రస్తుతమున్న ఆలయ కార్యాలయ కింది అంతస్తులోని క్యూలైన్లకు అనుసంధానం చేస్తారు.


ఇబ్బందులు తొలగనున్నాయి..
- ఆలూరి బాలాజీ, ఈవో

భక్తులు స్వామి దర్శనానికి వరుసలో గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అత్యాధునిక క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణంతో ఇక్కట్లు తీరిపోతాయి. నిర్మాణానికి స్థలాన్ని సిద్ధం చేశాం. నమూనా సైతం తయారైంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని