logo

450 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం.. 9 మందిపై కేసు

సిద్దిపేట శివారులోని గోదాములో 450 బస్తాల రేషన్‌ బియ్యం నిల్వను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది పై కేసు నమోదు చేశారు. సిద్దిపేటలోని లలితా పరమేశ్వరి పౌల్ట్రీఫాం గోదాములో అక్రమంగా బియ్యం నిల్వ చేశారని సిద్దిపేట 3టౌన్‌ సీˆఐ భానుప్రకాష్‌ తెలిపారు.

Published : 13 Aug 2022 01:38 IST

గోదాములో బస్తాలు

న్యూస్‌టుడే, కొండపాక: సిద్దిపేట శివారులోని గోదాములో 450 బస్తాల రేషన్‌ బియ్యం నిల్వను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మంది పై కేసు నమోదు చేశారు. సిద్దిపేటలోని లలితా పరమేశ్వరి పౌల్ట్రీఫాం గోదాములో అక్రమంగా బియ్యం నిల్వ చేశారని సిద్దిపేట 3టౌన్‌ సీˆఐ భానుప్రకాష్‌ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం గోదాములో సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశామన్నారు. హుస్నాబాద్‌, సిద్దిపేట పరిసర గ్రామాల నుంచి రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొన్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖకు సమాచారం ఇచ్చారు. సిద్దిపేట అర్బన్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పంచనామా చేశారు. బియ్యం బస్తాలు, తొమ్మిది చరవాణులు, సంచులు కుట్టే రెండు యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు