logo

రూ.లక్షలు వెచ్చించినా.. నెరవేరని లక్ష్యం!

పట్టణ ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. 

Updated : 08 Feb 2023 07:22 IST

జిల్లాలో బస్తీ దవాఖానాల తీరిలా

సంగారెడ్డి రిక్షా కాలనీలో..

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: పట్టణ ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది.  ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించింది. పరికరాలకు అదే తరహాలో ఖర్చు చేసి, నెలలు గడుస్తున్నా ప్రారంభోత్సవాలకు నోచుకోవడం లేదు. సంగారెడ్డి రిక్షా కాలనీ, అమీన్‌పూర్‌ శ్రీవాణి నగర్‌, సదాశివపేట పట్టణం పాత సీహెచ్‌సీ కేంద్రంలో, అందోలు గూడెం, నారాయణఖేడ్‌కు వీటిని మంజూరు చేశారు. ఆయా ప్రాంతాల్లో భవనాల ఆధునికీకరణకు రూ.13లక్షలు, రూ.2లక్షలు ఫర్నిచర్‌కు వెచ్చించారు. ఇందులో నారాయణఖేడ్‌లో మాత్రమే సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం అందులో కంటి వెలుగు వైద్య శిబిరం కొనసాగుతోంది. మిగిలిన నాలుగు చోట్ల ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆయా ఆసుపత్రులను ప్రారంభించాలని సూచించినా, అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికైనా ప్రారంభించాలని కోరుతున్నారు.  


త్వరలో అందుబాటులోకి తెస్తాం:
గాయత్రీదేవి, జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి, సంగారెడ్డి

జిల్లాలో నాలుగు చోట్ల బస్తీ దవాఖానాలను ప్రజాప్రతినిధుల సమయం తీసుకుని వాటి ప్రారంభోత్సవాలకు చర్యలు తీసుకుంటాం. పట్టణ వాసులకు వైద్యం అందించడమే లక్ష్యంగా వాటిని నెలకొల్పాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని