logo

బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ప్రమాణ స్వీకారం

సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాది కె.రాంరెడ్డి సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

Published : 01 Apr 2023 01:41 IST

సంగారెడ్డి అర్బన్‌, నారాయణఖేడ్‌: సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాది కె.రాంరెడ్డి సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వి.మహేశ్‌, ప్రధానకార్యదర్శి ఎన్‌.కృష్ణ, సంయుక్త కార్యదర్శి ఎ.బాలరాజు తదితరులు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. అనంతరం వారిని న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.

ఖేడ్‌లో ఎన్నిక:  నారాయణఖేడ్‌ బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంగమేశ్వర్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షులుగా ఆనంద్‌స్వరూప్‌శెట్కార్‌, ఉపాధ్యక్షులుగా పి.లక్ష్మణ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా మారుతిరెడ్డి, సంయుక్తకార్యదర్శిగా డి.చంద్రశేఖర్‌రావు, కోశాధికారిగా పి.నర్సింహారావు, మహిళా ప్రతినిధురాలిగా ప్రమీలపాటిల్‌ ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని