logo

బాలికపై అఘాయిత్యం

దేవరకొండకు అతి సమీపంలోని ఓ గ్రామంలో  బాలికపై మానవ మృగం కొన్ని నెలలుగా కామవాంఛ తీర్చుకున్నాడు. ఏడు ఆమె నెలల గర్భిణి కావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో

Published : 27 May 2022 03:06 IST

దేవరకొండ, న్యూస్‌టుడే: దేవరకొండకు అతి సమీపంలోని ఓ గ్రామంలో  బాలికపై మానవ మృగం కొన్ని నెలలుగా కామవాంఛ తీర్చుకున్నాడు. ఏడు ఆమె నెలల గర్భిణి కావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గర్భస్రావం చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలంలో పొరుగింటికి బంధువుగా వచ్చిన ఓ యువకుడు(35) సమీప ఇంటిలోని బాలికపై కన్నేశాడు. పదేళ్ల క్రితం తల్లి చనిపోయింది. ఇదే అదునుగా భావించిన కామాంధుడు  బాలికకు మాయమాటలు చెప్పి అనేకమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఇటీవల ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. బాలిక ఏడు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. చివరకు కాల్‌ లిస్ట్‌ ఆధారంగా యువకుని పేరు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అతన్ని నిలదీశారు. ఎక్కడ తన మీదకు వస్తుందోననే భయంతో యువకుడు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిని ఆశ్రయించి బాలికకు గర్భస్రావం చేయించారు. అనంతరం విషయం బయటకు పొక్కకుండా బాలికను మండల పరిధిలోని తమ బంధువుల ఇంటికి పంపించారు. తల్లికి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యే దశలో గర్భస్రావం చేసిన ఆస్పత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ దేవరకొండ సీఐ బీసన్నను వివరణ కోరగా గ్రామంలో జరిగిన సంఘటన తన దృష్టికి రాలేదన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని