logo

అరాచకాల్లో దిట్ట జగన్‌: బీద

హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్‌ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 18 Apr 2024 03:20 IST

మాట్లాడుతున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్‌ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రజలను మోసం చేసి.. ఇప్పుడు మీరే నన్ను కాపాడాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై ఏ రాష్ట్రంలో జరగనన్ని దాడులు వైకాపా ప్రభుత్వ పాలనలో ఏపీలో జరిగాయన్నారు. చినాన్న వివేకాను హత్య చేస్తే విచారణ జరపలేకపోయిన అసమర్థుడు జగన్‌ అని అన్నారు. వైఎస్‌ వివేకాను చంపింది ఎవరో.. ఎందుకు చంపారో వివరంగా జగన్‌ చెల్లెలు చెబుతుంటే.. జగన్‌ వర్గం తమకు సంబంధం లేదని   బుకాయిస్తోందన్నారు. జగన్‌కు, వైకాపా నేతలకు వత్తాసు పలికే ఐపీఎస్‌ అధికారి కాంతి రాణ టాటాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని