logo

పోలీస్‌ బందోబస్తు

సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

Published : 18 Apr 2024 03:29 IST

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు 30 పోలీసు యాక్ట్‌ను అమలులోకి తీసుకువచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్‌ కేంద్రాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి, లోక్‌సభ నామినేషన్‌ కేంద్రం వద్ద అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నామినేషన్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో అభ్యర్థుల ఊరేగింపులు నిలిపివేయనున్నారు.  

అధికారులు ఇలా..

నెల్లూరు ఎంపీ నామినేషన్‌ కేంద్రం వద్ద అదనపు ఎస్పీ సీహెచ్‌ సౌజన్యను, నెల్లూరు అర్బన్‌ : నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, నెల్లూరు గ్రామీణం : సీసీఎస్‌ డీఎస్పీ రామకృష్ణాచారి, కోవూరు : ట్రాఫిక్‌ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు, సర్వేపల్లి: నెల్లూరు గ్రామీణ డీఎస్పీ వీరాంజనేయరెడ్డిని నియమించారు. ఆత్మకూరు : డీఎస్పీ ఎన్‌.కోటారెడ్డి, కావలి : డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి : దిశ డీఎస్పీ టి.సాయినాథ్‌, కందుకూరుకు డీఎస్పీ ఎ.శ్రీనివాసులును కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని