logo

పాలకా.. మా బాధలు కనవా!

పట్టణంలోని సంతోష్‌నగర్‌లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది.

Published : 19 Apr 2024 03:53 IST

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

పట్టణంలోని సంతోష్‌నగర్‌లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. ఇరుకైన దారులతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా ఉంటోంది. వాణీనగర్‌ ప్రధాన వీధి మినహా కాలనీలోని మిగిలిన వీధులన్నీ ఇరుగ్గా ఉన్నాయి.

ళ్ల మధ్య ఉండే ఖాళీ స్థలాలు మురుగు కుంటలను తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక.. కొద్దిపాటి వర్షం పడినా ఖాళీ స్థలాల్లోకి నీరు చేరి నిల్వ ఉంటోంది. ఇళ్ల మధ్యనే ఉండడంతో దుర్గంధంతో ప్రజలు ముక్కులు మూసుకుని జీవిస్తున్నారు. ఇలాంటి ఖాళీ స్థలాలు కాలనీలో అధికంగా ఉన్నాయి. వీటిలో పిచ్చిమొక్కలు మొలిచి పందులు, దోమలకు ఆవాసాలుగా మారాయి. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. కాలనీ ఉత్తర భాగంలో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. వాణీనగర్‌ ప్రధాన వీధిలో కొంతమంది ప్రైవేటుగా ఏర్పాటుచేసిన వేగనిరోధకం ఇబ్బందికరంగా ఉంది. వాహనాలు అటుగా వెళ్లే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నట్లు వాపోతున్నారు.


డ్రైనేజీ అస్తవ్యస్తం  

-న్యామతుల్లాషా

మురుగు నీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. చిరుజల్లులు కురిసినా సగం రోడ్లు నీట మునుగుతున్నాయి. ఆ సమయంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. సమస్యపై అనేకసార్లు విన్నవించినా పరిష్కారం కావడం లేదు.


అంతర్గత రోడ్లు లేవు  

- దివి హరిబాబు

ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లోకి నీరు చేరుతుండడంతో తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. కాలనీకి ఉత్తర వైపు అంతర్గత రోడ్లు లేవు. వర్షాకాలంలో బురదమయంగా మారుతున్నాయి. ప్రధాన రోడ్లు కూడా ఇరుకుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని