logo

కేసుల లెక్క తప్పుతోంది..

కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల లెక్క తప్పుతోంది. జిల్లాలో వెలుగుచూస్తున్న వాటికి.. రాష్ట్ర పోర్టల్‌లో నమోదవుతున్న వాటికి పొంతన ఉండటం లేదు. జిల్లాలో ఆయా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలను చాలాచోట్ల ఆన్‌లైన్‌ చేయడం

Published : 23 Jan 2022 04:19 IST

రాష్ట్ర పోర్టల్‌లో ఒకలా.. జిల్లాలో మరోలా
న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం

కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల లెక్క తప్పుతోంది. జిల్లాలో వెలుగుచూస్తున్న వాటికి.. రాష్ట్ర పోర్టల్‌లో నమోదవుతున్న వాటికి పొంతన ఉండటం లేదు. జిల్లాలో ఆయా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలను చాలాచోట్ల ఆన్‌లైన్‌ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. కేసులు ఎక్కువొచ్చిన చోట తక్కువ చేసి చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్ని కేంద్రాల్లో పాజిటివ్‌ల వివరాలను చెప్పడానికి సిబ్బంది సంకోచిస్తున్నారు.

ఆంతర్యమేమిటో..?
జిల్లాలో ఐదు రోజులుగా వందకు పైగా కేసులు నమోదవుతున్నా 40లోపే రాష్ట్ర పోర్టల్‌లో చూపడంలో ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు. వైరస్‌ వచ్చిన వారి పేర్లను బహిర్గతం చేయకున్నా కేసుల సంఖ్య ఇస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. జ్వర సర్వేలోనూ వందలాది మందికి కొవిడ్‌ లక్షణాలు వెలుగుచూస్తున్నాయి.

దాస్తే నష్టం
పాజిటివ్‌ కేసుల లెక్కలు సరిగా లేకుంటే అటు ప్రజలకు, ఇటు అధికారులకు నష్టమని నిపుణులు సూచిస్తున్నారు. చికిత్స పొందిన వారు, కోలుకున్నవారి వివరాల జాబితాలు పక్కాగా ఉంటే ముప్పును ఎలా ఎదుర్కోవాలో సన్నద్ధంకావొచ్చు. జిల్లా నుంచి రాష్ట్రశాఖకు సరైన నివేదికలు పంపితే ఆస్పత్రుల్లో ఆ మేరకు వసతులు సమకూరే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని