logo

ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు రకాల సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటింకి అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోందని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం

Published : 27 Jan 2022 05:05 IST

కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేస్తున్న పాలనాధికారి నారాయణరెడ్డి, సీపీ నాగరాజు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు రకాల సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటింకి అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోందని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆవరణలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గణతంత్ర వేడుకలు సాదాసీదాగా నిర్వహించామన్నారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీపీ నాగరాజు, అదనపు పాలనాధికారులు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, మేయర్‌ నీతూకిరణ్‌, అదనపు డీసీపీలు వినీత్‌, అరవింద్‌ బాబు, డీసీఎస్‌వో వెంకటేశ్వర్‌రావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ అభిషేక్‌, డీఆర్‌డీవో చందర్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, సంక్షేమ శాఖ అధికారులు రమేష్‌, శశికళ, మెప్మా పీడీ రాములు, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అదనపు

కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని