logo

ఎలుకల భయంతో కస్తూర్బా విద్యార్థినులకు టీకాలు

ఎలుకలు కరుస్తాయనే భయంతో మాచారెడ్డి మండలం ఆరేపల్ల్లిస్టేజ్‌ సమీపంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు ఆదివారం సాయంత్రం పీహెచ్‌సీలో టీకాలు ఇప్పించారు.

Published : 23 May 2022 04:10 IST

మాచారెడ్డి, న్యూస్‌టుడే: ఎలుకలు కరుస్తాయనే భయంతో మాచారెడ్డి మండలం ఆరేపల్ల్లిస్టేజ్‌ సమీపంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులకు ఆదివారం సాయంత్రం పీహెచ్‌సీలో టీకాలు ఇప్పించారు. మూడు రోజుల క్రితం పాఠశాలలో రాత్రి కాపలాదారుగా పని చేస్తున్న వ్యక్తిని ఎలుక కరిచింది. ఈ విషయం విద్యార్థినుల ముందు చర్చించగా రాత్రుళ్లు తమపై నుంచీ తిరుగుతున్నాయని చెప్పారు. సోమవారం నుంచి వారికి పరీక్షలు ఉండటంతో పాఠశాల సిబ్బంది ముందు జాగ్రత్తగా మాచారెడ్డి పీహెచ్‌సీకి తీసుకొచ్చి టీటీ, యాంటీ రేబిస్‌ టీకాలు వేయించారు. ‘న్యూస్‌టుడే’ ఈ విషయంపై సెక్టోరల్‌ అధికారిణి ఉమారాణిని వివరణ కోరగా కస్తూర్బాను సందర్శించి విచారణ చేస్తామని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని