logo

బతుకమ్మ సాక్షిగా పోరాడతాం

పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే వరకు బతుకమ్మ సాక్షిగా పోరాడతామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ పేర్కొన్నారు.

Published : 02 Oct 2022 04:51 IST


నిరసన తెలుపుతున్న జంగంపల్లి గ్రామ ప్రజలు

భిక్కనూరు, న్యూస్‌టుడే: పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే వరకు బతుకమ్మ సాక్షిగా పోరాడతామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ పేర్కొన్నారు. జంగంపల్లి గ్రామస్థులు 13 రోజులుగా ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక గుడిసెలు వేసుకొని నిరసన కొనసాగిస్తున్నారు. శనివారం బతుకమ్మ సంబరాలను అక్కడే జరిపారు. గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తిరిగి పేదలకు అందించాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు, బాల్‌రాజ్‌గౌడ్‌, అర్జున్‌, నర్సవ్వ, యాదమ్మ, ఎల్లమ్మ, నాగమణి, రాజమణి, వెంకటమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని