logo

నిజామాబాద్‌ బరిలో 29 మంది

నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి.

Published : 30 Apr 2024 05:52 IST

ఆర్మూర్‌ ఆర్డీవో రాజాగౌడ్‌
నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి. 32 మంది ఉండగా సోమవారం ముగ్గురు స్వతంత్రులు ఉప సంహరించుకోవడంతో 29 మంది పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తులు కేటాయించినట్లు తెలిపారు.

అభ్యర్థులు వీరే

 ధర్మపురి అర్వింద్‌(భాజపా), బాజిరెడ్డి గోవర్ధన్‌(భారాస), తాటిపర్తి జీవన్‌రెడ్డి(కాంగ్రెస్‌), లింబాద్రి(బీఎస్పీ), అశోక్‌గౌడ్‌(బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌), అలీ మన్సూర్‌(అన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌), సుమన్‌(డీఎస్పీ), సాయి కృష్ణమూర్తి(యుగ తులసీ), నగేష్‌(దళిత బహుజన), దేవతి శ్రీనివాస్‌(బహుజన ముక్తి), భూక్యా నందు(విద్యార్థుల రాజకీయ పార్టీ), రాజ్‌ కుమార్‌(ఇండియా ప్రజాబంధు), యోగేందర్‌(అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్స్‌ పార్టీ), ఆరె రాజేందర్‌, కొత్తకొండ శక్తిప్రసాద్‌, కోటగిరి శ్రీనివాస్‌, గంట చరితారావు, గోపి చంద్రయ్య, జీవన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, బీబీనాయక్‌, సాయినిఖిల్‌, ప్రశాంత్‌, మలావత్‌ విఠల్‌, రాగి అనిల్‌, రాపల్లి సత్యనారాయణ, రేపల్లి శ్రీనివాస్‌, విక్రమ్‌రెడ్డి, సయ్యద్‌ అస్గర్‌(స్వతంత్రులు) బరిలో ఉన్నారు.

 రెండు ఈవీఎంలు అవసరం

ఎక్కువ మంది బరిలో ఉండడంతో రెండు ఈవీఎంలు తప్పనిసరైంది. బ్యాలెట్‌ యూనిట్‌లో నోటాతో కలిపి 16 గుర్తులుంటాయి. బరిలో 29 మంది ఉండటంతో ప్రతి పోలింగ్‌ బూత్‌లో రెండు చొప్పున బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. అదనపు యంత్రాలు తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు, చిత్రంలో అదనపు పాలనాధికారి అంకిత్‌, సాధారణ పరిశీలకురాలు ఎలిస్‌వజ్‌,

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని