logo

మంచానికే పరిమితమైనా.. అందని పింఛను

‘మా అబ్బాయికి చదువంటే చాలా ఇష్టం. గుర్తు తెలియని వ్యాధితో నడుము నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయాయి. వైద్యానికి చేతిలో డబ్బు లేదు. ఉన్నత వైద్యం అందించి ఆదుకోవాలి’ ఇది ఓ తండ్రి ఆవేదన.

Published : 28 Nov 2022 01:21 IST

బాలుడికి సపర్యలు చేస్తున్న తల్లి

గుణుపురం, నూస్‌టుడే: ‘మా అబ్బాయికి చదువంటే చాలా ఇష్టం. గుర్తు తెలియని వ్యాధితో నడుము నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయాయి. వైద్యానికి చేతిలో డబ్బు లేదు. ఉన్నత వైద్యం అందించి ఆదుకోవాలి’ ఇది ఓ తండ్రి ఆవేదన. గుణుపురం సమితిలోని డొంబుసొరా గ్రామానికి చెందిన మీనకేతన సబర కుమారుడు విభూతి సబర నాలుగేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. బాలుడి తల్లిదండ్రులు రోజూ కూలికి వెళ్తే గాని పూట గడవదు. విభూతి గొడియాబంద గ్రామంలోని మేనమామ ఇంట్లో ఉంటూ అయిదో తరగతి వరకు చదివాడు. అయిదో తరగతి చదువుతున్న సమయంలో కాళ్లు, చేతుల నొప్పులు రావడంతోపాటు నడవలేకపోయాడు. వెంటనే గుణుపురం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం బ్రహ్మపుర పెద్దాసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇటీవల గుణుపురంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టరు స్వాధాదేవ్‌ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. కనీసం పింఛను కూడా అందడం లేదని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయమై గుణుపురం బీడీఓ శాంతిప్రభా ప్రధాన్‌తో మాట్లాడగా ఆ కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తామని, బాలుడికి దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, మూడు చక్రాల సైకిల్‌ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారితో మాట్లాడి ఉన్నత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని