logo

5న దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో 4వ తేదీన తుపాను ఆవర్తనం ఏర్పడుతుందని, 5న ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ గురువారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Published : 02 Dec 2022 03:30 IST

ఒడిశాపై ప్రభావం ఉండకపోవచ్చు: ఐఎండీ

గురువారం ఉదయం 7.30 గంటలకు జి.ఉదయగిరి ఫుల్బాణి రోడ్డులో దృశ్యం

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ తీరంలో 4వ తేదీన తుపాను ఆవర్తనం ఏర్పడుతుందని, 5న ఇది అల్పపీడనంగా మారుతుందని గోపాలపూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ గురువారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఈ పీడనం తర్వాత మరింత బలం పుంజుకుని వాయుగుండంగా మారి 8న తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య తీరం దాటుతుందన్న అంచనా ఉందన్నారు. ఈ విపత్తు ప్రభావం ఒడిశాపై ఉండకపోవచ్చని, పాక్షిక మబ్బులు ఉండవచ్చునని తెలిపారు. దీంతో ఉత్తర భారతం మీదుగా వీస్తున్న చలిగాలులు తగ్గుతాయని, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని చెప్పారు. గురువారం కొంధమాల్‌ జిల్లా జి.ఉదయగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.4 డిగ్రీలుగా నమోదైందన్నారు. మిగతా కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు 12 నుంచి 20 డిగ్రీలుగా నమోదయ్యాయని తెలిపారు. శుక్రవారం రాయగడ, కొరాపుట్‌, కొంధమాల్‌, కలహండి జిల్లాల్లో మంచు కురుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో గురువారం కొంధమాల్‌, బౌద్ధ్‌, కలహండి, నువాపడ జిల్లాల్లో మంచు కురిసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని