logo

ప్రజా చైతన్యంతోనే క్యాన్సర్‌ నుంచి విముక్తి

పొగాకు ఉత్పత్తుల వినియోగానికి అంతా దూరంగా ఉండాలని, ప్రజా చైతన్యంతోనే క్యాన్సర్‌ నుంచి విముక్తి సాధ్యమని అతిథులు పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 03:16 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బిక్రం పండా. చిత్రంలో ఇతర అతిథులు, నిర్వాహకులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: పొగాకు ఉత్పత్తుల వినియోగానికి అంతా దూరంగా ఉండాలని, ప్రజా చైతన్యంతోనే క్యాన్సర్‌ నుంచి విముక్తి సాధ్యమని అతిథులు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా స్థానిక సామాజిక, సాంస్కృతిక, క్రీడా సంస్థ ‘క్రాంతి’ ఆధ్వర్యంలో శనివారం చైతన్య సమావేశం, భారీ పాదయాత్ర నిర్వహించారు. ఉదయం స్థానిక కళ్లికోట వర్సిటీ మైదానంలో నిర్వహించిన సమావేశానికి బ్రహ్మపుర ఎమ్మెల్యే బిక్రంకుమార్‌ పండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అతిథులుగా బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, కళ్లికోట వర్సిటీ వీసీ ఆచార్య ప్రఫుల్ల కుమార్‌ మహంతి, బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ ఎం., కార్పొరేటరు సంజిత్‌ పాణిగ్రహి, ఎస్‌ఎంఐటీ విద్యాసంస్థల అధ్యక్షుడు భగవాన్‌ గంతాయత్‌, సంతోష్‌ కుమార్‌ జెనా, సుశాంత సాబత్‌, దీపక్‌కుమార్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ సంస్థలకు చెందిన వందలాది మందితో పాదయాత్ర నిర్వహించారు. దీనికి అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగిన పాదయాత్ర తిరిగి కళ్లికోట వర్సిటీ మైదానంలో ముగిసింది. నిర్వాహక ‘క్రాంతి’ కార్యనిర్వాహక సంచాలకుడు దేవానంద దాస్‌, ఇతర ప్రతినిధులు సంజయ్‌ కుమార్‌ రథ్‌, నిర్మలా దాస్‌, దేవరాజ్‌ రౌత్‌, సరోజ్‌ సాహు, స్నిగ్ధ మహరణా తదితరులు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు.

పాదయాత్రలో పాల్గొన్న వివిధ విద్యాసంస్థల విద్యార్థులు తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని