logo

విశ్వసనీయత కోల్పోతున్న నవీన్‌ ప్రభుత్వం

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హత్యల నేపథ్యంలో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతోందని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

Published : 06 Feb 2023 03:20 IST

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హత్యల నేపథ్యంలో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతోందని కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఆదివారం భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్య జరిగి 8 రోజులు కావస్తున్నా దర్యాప్తు వివరాలు నిగ్గు తేలక పోవడం దురదృష్టకరమన్నారు. క్యాబినెట్‌ మంత్రి హత్య తరువాత ప్రభుత్వం క్రైంబ్రాంచ్‌కి కేసు అప్పగించి మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. హోంశాఖ నిర్వహణ తీసికట్టుగా తయారైందని, ఆ శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం మౌనం అనుమానాలకు తావిస్తోందన్నారు. మాజీ మంత్రి హత్యకేసు దర్యాప్తు బాధ్యత సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని