logo

Casting couch: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తున్నాడు

హీరోయిన్‌ ప్రకృతి మిశ్ర నిర్మాత సంజయ్‌ నాయక్‌పై క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Updated : 10 Jun 2023 08:28 IST

సినిమాల్లో అవకాశమిస్తానని యువతులను లోబరుచుకుంటున్నాడు
ఆ తరువాత ముఖం చాటేస్తున్నాడన్న హీరోయిన్‌ ప్రకృతి మిశ్రా
ఆమెకు మద్దతు తెలిపిన నటి జాస్మిన్‌ రథ్‌

కటక్‌, న్యూస్‌టుడే: హీరోయిన్‌ ప్రకృతి మిశ్ర నిర్మాత సంజయ్‌ నాయక్‌పై క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గురువారం ఆమె మీడియా ముందు మాట్లాడుతూ.... తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి సంజయ్‌ నాయక్‌ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని, అవసరం తీరిన తరువాత ముఖం చాటేస్తున్నాడని ఆరోపించారు. ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు మరో నటి జాస్మిన్‌ రథ్‌ మద్దతు తెలిపింది. దీనిపై శుక్రవారం నిర్మాత సంజయ్‌ నాయక్‌ స్పందించారు. ఆరోపణలు ఖండించారు. ప్రకృతి మిశ్రా, హీరో బాబు సాన్‌ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందేనన్నారు. ఆ సమయంలో బాబు సాన్‌కు మద్దతు ఇచ్చానన్న అక్కసుతో ప్రకృతి మిశ్రా ఇలాంటి నిరాధారమైన నిందలు వేస్తోందన్నారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలను కోర్టుకు లాగుతానని సంజయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని