logo

71 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసేది వీరే..

ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్‌ పట్నాయక్‌ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు.

Published : 28 Mar 2024 04:38 IST

సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రకటించిన సీఎం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్‌ పట్నాయక్‌ బుధవారం మధ్యాహ్నం వీడియో సందేశం ద్వారా 71 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా స్వయంగా ప్రకటించారు. దీనికి ముందుగా భాజపాతో చేతులు కలపడానికి సుదీర్ఘ కసరత్తు జరిగిన సంగతి తెలిసిందే. ఇది విఫలమైన తర్వాత అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గట్టి కసరత్తు జరిగింది. పార్టీ టికెట్ల కోసం వేలాదిమంది ఆశావహులు దరఖాస్తులు చేశారు. ఆదరణ, విద్యార్హత, విధేయత ఉండి, నేర చరిత్ర, ఆరోపణలు లేనివారికే సీఎం అవకాశమిస్తారని బిజద అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల ద్వారా సేకరించిన వివరాల మేరకు అభ్యర్థుల బలాబలాలు పరిశీలిస్తున్న నవీన్‌ ఈసారి యువకులు, మహిళలకు పెద్దపీట వేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో విడుదలైన జాబితాలో మంత్రులందరికీ అవకాశమిచ్చారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారూ ఉన్నారు. విజయావకాశాలు పక్కన పెడితే ఆయాచోట్ల పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహులు అసంతృప్తికి గురయ్యారు. వీరిలో కొందరు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. సీఎం చుట్టూ ఉన్న కొందరి ఒత్తిడి మేరకు అభ్యర్థుల ఎంపిక అస్తవ్యస్థంగా జరిగి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

అవకాశం దక్కించుకున్న మంత్రులు

మిగిలిన అభ్యర్థుల వివరాలు... రఘునాథ్‌ గమాంగ్‌ (గుణుపురం), అనుసాయ మాఝి (రాయగడ), దేబేష్‌ ఆచార్య (బరగఢ్‌), స్నేహాంగిని చురియా (అతాబిరా), సుశాంతసింగ్‌ (భట్లీ), శుభాషిని జెనా (బస్తా), సంజీవ్‌ మల్లిక్‌ (భొండారి పొఖరి), ప్రఫుల్ల సామల్‌ (భద్రక్‌), బిష్ణుబ్రత రౌత్రాయి (బాసుదేవపూర్‌), సంజయ్‌ దాస్‌ (ధాం నగర్‌), వ్యోమకేస్‌ రాయ్‌ (చాంద్‌బలి), ప్రణవ బల్వంత్రాయ్‌ (ధర్మశాల), సుజాత సాహు (జాజ్‌పూర్‌), సుధీర్‌కుమార్‌ సామల్‌ (ఢెంకనాల్‌), నృసింహసాహు (పరజంగ), ముఖేష్‌ పాల్‌ (పలలహడ), సుశాంత కుమార్‌ బెహరా (ఛండిపద), నిహార్‌ బెహరా (లొయిసింగ), సరోజ్‌ మెహర్‌ (పాట్నాగఢ్‌), కాళికేష్‌ సింగ్‌దేవ్‌ (బొలంగీర్‌),  నబీన నాయక్‌ (ఉమర్‌కోట్‌), రమేష్‌ మాఝి (ఝరిగాం), కౌసల్య ప్రధాన్‌ (నవరంగపూర్‌), మనోహర్‌ రాంధారి (డాబుగాం), ప్రదీప్‌ దిశారి (లంజిగఢ్‌), దివ్యశంకర్‌ మిశ్ర (జునాగఢ్‌), పుష్పేంద్రసింగ్‌ దేవ్‌ (ధర్మగఢ్‌), లతికా నాయక్‌ (భవానీ పాట్నా), సలుగా ప్రధాన్‌ (జి.ఉదయగిరి), మహీధర్‌ రొణ (కంటామాల్‌), దేవీప్రసాద్‌ మిశ్ర (బొడాంబ), దేవీరంజన్‌ త్రిపాఠి (బంకీ), సౌవిల్‌ బిశ్వాల్‌ (కటక్‌ చౌద్వార్‌), ప్రమోద్‌ మల్లిక్‌ (నియాలి), చంద్రసారథి బెహరా (కటక్‌ సదర్‌), అరవింద్‌ మహాపాత్ర్‌ (పట్కురా), ధ్రువసాహు (రాజ్‌నగర్‌), సునీల్‌ మహంతి (పూరీ), ఉమాసామంత్రాయ్‌ (బ్రహ్మగిరి), సంజయ్‌ దాస్‌ వర్మ (సత్యబాది), రుద్రప్రతాప్‌ మహారథి (పిపిలి), బిభూతి బల్వంత్రాయ్‌ (జట్నీ), సత్యప్రధాన్‌ (రణపూర్‌), రమేష్‌ బెహరా (దసపల్లా), అరుణ్‌కుమార్‌ సాహు (నయాగఢ్‌), శ్రీకాంత సాహు (పొలసర), లతికా ప్రధాన్‌ (కవిసూర్య నగర్‌), సుభాష్‌చంద్ర బెహరా (ఛత్రపురం), సంఘమిత్ర స్వయిన్‌ (సురడి), బిక్రం పండా (గోపాల్‌పూర్‌), బిప్లవ్‌ పాత్ర్‌ (దిగపొహండి), చిన్మయానంద శ్రీరూప్‌దేవ్‌ (చికిటి), చంద్రశేఖర్‌ మాఝి (కోట్పాడ్‌), రఘురాం పడాల్‌ (కొరాపుట్‌), మానస్‌ మడ్కామి (మల్కాన్‌గిరి), బద్రినారాయణ పాత్ర్‌ (ఘసిపుర)లు జాబితాలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని